KCR : తెలంగాణ రాష్ట్రంలో కొంత కాలం నుంచి ఎదురు చూస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్(KCR). ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు.
అంతే కాకుండా ఇప్పటి దాకా కొన్నేళ్ల పాటు వెట్టి చాకిరి చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి కూడా తీపి కబురు చెప్పారు. ఇందులో భాగంగా 11 వేల 103 మంది కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
ఇకపై కాంట్రాక్టు సిబ్బంది అంటూ ఉండరని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఈ కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా వచ్చారని తెలిపారు.
ప్రభుత్వ రంగంలో ఇంత భారీ సంఖ్యలో జాబ్స్ ఉండడం సబబు కాదని తాము భావించామన్నారు. గతంలో క్లారిటీ రాక పోవడం వల్లనే ఉద్యోగాలు భర్తీ చేయలేక పోయామని చెప్పారు.
ఈ మేరకు ప్రకటించిన జాబ్స్ కోసం వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం (KCR)ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.
2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు కేసీఆర్. కొందరు కోర్టుల్లో వేసిన పిటిషన్ల కారణంగా నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఆలస్యం జరిగిందన్నారు. అంతకు ముందు కేసీఆర్.
అంతే కాకుండా నోటిఫికేషన్లు రాక పోవడం వల్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు 10 ఏళ్లు పెంచుతున్నట్లు ప్రకటించారు కేసీఆర్.
Also Read : సారు ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ