AK Antony : కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఆంటోని గుడ్ బై

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

AK Antony  : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. అపార‌మైన అనుభ‌వం, నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కుడిగా పేరొందిన కేర‌ళ‌కు చెందిన ఏకే ఆంటోనీ (AK Antony )ఇక పాలిటిక్స్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. ఈ మేర‌కు ఇవాళ ఆయ‌న ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. చాలా ప‌ద‌వులు నిర్వ‌హించాన‌ని, ఇక నుంచి తాను విశ్రాంతి తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ నుంచి త‌న స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురంకు వెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏప్రిల్ 2తో త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం పూర్త‌వుతుంది. పాలిటిక్స్ కు దూరంగా ఉంటాన‌ని, ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించారు ఏకే ఆంటోనీ.

ఇదిలా ఉండ‌గా ఆనాటి ఇందిరాగాంధీ నుంచి నేటి సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ వ‌ర‌కు ఏకే ఆంటోనీ పార్టీలో త‌న‌దైన ముద్ర వేశారు. దాదాపు 52 ఏళ్ల పాటు సేవ‌లు అందించారు. ఏకే ఆంటోనీ ఒక విల‌క్ష‌ణ‌మైన నాయ‌కుడు.

విద్యార్థి నాయ‌కుడిగా ఉన్నారు. 1970లో మొద‌టి సారిగా శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. కేవ‌లం 37 ఏళ్ల‌కే కేర‌ళ రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక‌య్యారు. ఇప్ప‌టి దాకా మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా, మూడు సార్లు కేంద్ర మంత్రిగా ఆయ‌న ప‌ని చేశారు.

త‌న కెరీర్ లో ఇది ఒక చ‌రిత్ర‌. రాజ్య‌స‌భ‌కు ఐదుసార్లు ప్రాతినిధ్యం వ‌హించారు. ఆనాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు.

మొత్తంగా ఏకే ఆంటోనీ లాంటి అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు దూరం కావ‌డం పార్టీకి తీర‌ని న‌ష్ట‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మం – బాద‌ల్

Leave A Reply

Your Email Id will not be published!