DK Shiva Kumar : గోవాలో హ‌స్తందే హ‌వా – డీకేఎస్

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు

DK Shiva Kumar  : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గోవా రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఈనెల 10న ఓట్ల లెక్కింపులో అనూహ్య‌మైన ఫ‌లితాలు రాబోతున్నాయ‌ని జోష్యం చెప్పారు.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇంటికే ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌న్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున రాష్ట్ర ఎన్నిక‌ల ఇన్ చార్జీగా ఉన్నారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar ).

ఇవాళ ప్ర‌త్యేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌తో భేటీ అయ్యారు డీకేఎస్. ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ప‌రిణామాలు, ఫ‌లితాల త‌ర్వాత పార్టీ అభ్య‌ర్థులు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దానిపై చ‌ర్చించారు.

ఇదిలా ఉండ‌గా ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందంటూ పేర్కొన్నాయి. దీంతో వారిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర‌ర్భంగా పార్టీ అభ్య‌ర్థులంద‌రితో ప్రార్థ‌నాల‌యాల్లో వారితో ప్రతిజ్ఞ చేయించింది పార్టీ.

ఎక్క‌డికీ వెళ్ల‌మ‌ని పార్టీతోనే ఉంటామ‌ని. ఈ కార్యక్ర‌మంలో ఎన్నిక‌ల ఇన్ చార్జ్ లుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబ‌రం, గుండూ రావు, డీకేఎస్. త‌మ అభ్య‌ర్థులంతా రిసార్ట్ లో ఉంటార‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు శివ‌కుమార్.

గోవాలో హంగ్ ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా బీజేపీ, కాంగ్రెస్ , ఆప్ పార్టీలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

ఎమ్మెల్యే అభ్య‌ర్థులంద‌రినీ రిసార్టుల‌కు త‌ర‌లించారు. ఇదే స‌మ‌యంలో చిన్న పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది పార్టీ.

Also Read : ఐటీ దాడుల‌పై రౌత్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!