Bhagwant Mann : దేశ వ్యాప్తంగా రేపటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే దృష్టి సారించింది. ప్రధానంగా ఉత్తరాఖండ్ , గోవా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ , మణిపూర్ రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లోకి వస్తుందని కోడై కూశాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
దీంతో అందరి దృష్టి ఇప్పుడు భగవంత్ మాన్ (Bhagwant Mann) చుట్టూ తిరుగుతోంది. దీంతో ఇవాళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక వేళ సీఎం నైనా భవంతుల్లో ఉండనని కేవలం సామాన్యుడిగానే ఉంటానని చెప్పాడు.
ప్రజలు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు.
ఇదిలా ఉండగా తాము ఎగ్జిట్ పోల్స్ నమ్మబోమని మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పారు సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ.
ఇంకో వైపు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ అయితే ఏకంగా ఎగ్జిట్ పోల్స్ పై పూర్తిగా నిషేధం విధించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఈ తరుణఃలో భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో పాలకులు అందమైన భవంతులకే పరిమితమై పోయారని కానీ తాము వచ్చాక సామాన్యులకు పట్టం కడతామని స్పష్టం చేశారు మాన్.
కీర్తి, ప్రతిష్టలు ఎల్లప్పుడూ ఉండవన్నారు. ప్రజా సేవనే శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.
Also Read : గోవాలో హస్తందే హవా – డీకేఎస్