Raghav Chadha : పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ కో ఇన్ ఛార్జ్ రాఘవ్ చద్దా ((Raghav Chadha)సంచలన కామెంట్స్ చేశారు. కొద్ది గంటల్లో దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఈ తరుణంలో పంజాబ్ లో కాంగ్రెస్ తన పట్టు కోల్పోతోందని దాని స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రానుందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి.
ఈ తరుణంలో రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాబోయే రోజుల్లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను దేశ ప్రధానమంత్రిగా చూడటం ఖాయమని జోష్యం చెప్పారు.
మెరుగైన పాలనతో సీఎం ఆశాజనకంగా మారారని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది ఆయనే పీఎం కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ దేవుడు కరుణిస్తే ప్రజలు ఛాన్స్ ఇస్తే ఆయన ప్రధాని తప్పక అవుతారని అన్నారు.
ప్రస్తుతం చద్దా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయ వర్గాలలో ప్రకంపనలు రేపుతున్నాయి. తమ పార్టీకి పంజాబ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు.
ప్రజలు పూర్తిగా మార్పు కోరుతున్నారని ఆ విషయం రేపటితో తేలి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాచరిక పాలన సాగించిందని ఆరోపించారు. కానీ తాము సామాన్యులకే పట్టం కట్టడం ఖాయమన్నారు.
త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని రాఘవ్ చద్దా (Raghav Chadha)చెప్పారు. భారతీయ జనతా పార్టీకి దేశంలో పవర్ లోకి రావడానికి పది సంవత్సరాలు పట్టిందని కానీ తమకు అంత సమయం అక్కర్లేదన్నారు చద్దా.
Also Read : బీజేపీ..కాంగ్రెస్ టచ్ లో ఉన్నాయి