Maria Zakharova : రష్యా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై ఏకపక్షంగా దాడులకు తెగబడుతూ విధ్వంసం సృష్టిస్తున్న రష్యా ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జెలెన్ స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని తాము కూల్చేందుకు ఇష్ట పడటం లేదని(Maria Zakharova )స్పష్టం చేసింది.
ఇవాళ రష్యా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జఖరోవా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఈ కీలక కామెంట్స్ చేశారు ఉక్రెయిన్ పై.
అయితే అమెరికా సహాయంతో ఉక్రెయిన్ లో జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు.
అందుకే తాము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. బయలాజికల్ పరిశోధన కోసం ప్రయగశాలలు ఆ దేశంలో ఉన్నట్లు తేలిందన్నారు. శాంతియుతంగా ఉపయోగించడం కానీ శాస్త్రీయ లక్ష్యాల గురించి తాను ఇక్కడ ప్రస్తావించ దల్చు కోలేదన్నారు.
ఈ కార్యక్రమాలకు పరోక్షంగా అమెరికా నిధులను సమకూరుస్తోందంటూ మండిపడ్డారు. వీటి గురించి ముందు కారుకూతలు కూస్తున్న ఆ దేశం ప్రపంచానికి చెప్పాలని సవాల్ విసిరారు.
తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆర్థిక ఆంక్షలు విధించినంత మాత్రాన తమకు ఏమీ కాదన్నారు. ఇదిలా ఉండగా తమపై రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది అమెరికా.
తాము సామాన్యులపై దాడులు చేయడం లేదని జఖరోవా సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ చర్చలకు రావాలని తాము కోరుతున్నామని వెల్లడించారు.
అయితే ఆ దేశాన్ని అమెరికా , తదితర దేశాలు కావాలని ఎగ దోస్తున్నాయంటూ ఆరోపించారు. యుఎస్ ఆరోపిస్తున్నట్లు ఇది యుద్దం మాత్రం కాదని కేవలం సైనిక చర్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
Also Read : ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు