Satya Pal Malik : అధికారంలో ఉంటూనే భారతీయ జనతా పార్టీ కంట్లో నలుసులా మారారు ఆ పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను ఆయన టార్గెట్ చేశారు.
రైతులపై దాడులు జరగడాన్ని ఆయన తప్పు పట్టారు. దేశంలోని రైతులంతా ఏకం కావాలని మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అంతా కలిసికట్టుగా పోరాడితే బీజేపీ ప్రభుత్వం కూలి పోవడం ఖాయమన్నారు.
హరియాణా లోని జింద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్య పాల్ మాలిక్ పాల్గొన్నారు. తన పదవీ కాలం ముగిశాక నార్త్ ఇండియా అంతా మొత్తం పర్యటిస్తానని చెప్పారు.
అన్నదాతలను అంతా ఒకే చోటుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు సత్య పాల్ మాలిక్. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.
అంతా కలిసి కట్టుగా ఏకం కావాలి. మీరే కీలకం. ఈ దేశంలో 65 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఈ తరుణంలో మీపై ఇంకొకరు ఎలా పెత్తనం చేస్తారంటూ ప్రశ్నించారు గవర్నర్.
పవర్ ను అనుభవిస్తున్న వారంతా మీరు తిరగబడితే పారి పోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సత్య పాల్ మాలిక్. అధికారంలో ఉన్న వారు రైతుల్ని యాచకులుగా చూస్తున్నారని ఇది పోవాలంటే మీరంతా ఏకం కావాలన్నారు.
పోరాడితే ఇంకొకరు ఇచ్చే కనీస మద్దతు ధర అవసరం లేదన్నారు.
Also Read : కేజ్రీవాల్ దేశానికి కాబోయే ప్రధాని