Election Results 2022 : క‌మ‌లం విక‌సించేనా ఆప్ స‌త్తా చాటేనా

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

Election Results 2022  : దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాల‌పై (Election Results 2022 )ఎడ‌తెగ‌ని ఉత్కంఠ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ముగిశాయి. ఇవాళ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ వాటి అంచ‌నా గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్ లో వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కానీ ఓ క్లారిటీ రాదు. యూపీలో యోగీ పాల‌న‌కు ప‌రీక్ష‌గా మారింది.

ఇక ప్ర‌ధాన మంత్రి ఈ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. గ‌తంలో లేనంత‌గా ఆయ‌న యూపీపై ఫోక‌స్ పెట్టారు. ఇక్క‌డ ప‌వ‌ర్ లో ఉన్న త‌మ‌కు మ‌రోసారి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌నే ధీమాతో ఉన్నారు.

బ‌రిలో ఎన్ని పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ మ‌ధ్యే ఉంది. ఇక పంజాబ్ లో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ఇక్క‌డ ఊహించ‌ని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ గ‌ట్టి పోటీని ఇస్తోంది.

ముందే త‌మ పార్టీ అభ్య‌ర్థిని సీఎంగా ప్ర‌క‌టించారు. హామీల వ‌ర్షం కురిపించారు ఆ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే ఇక్క‌డ నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది.

ఇక ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఉత్త‌రాఖండ్ లో. మాజీ సీఎం, కేంద్ర మంత్రి , కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ హ‌రీష్ రావ‌త్ ఇక్క‌డ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. పుష్క‌ర్ సింగ్ ధామీకి చుక్క‌లు చూపిస్తున్నారు.

ఇక గోవాలో కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ రెండు రాష్ట్రాలలో హంగ్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇక మ‌ణిపూర్ లో ఏక‌ప‌క్షంగా సాగ‌నుంది. మొత్తం మీద మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎవ‌రు ప‌వ‌ర్ లోకి వ‌స్తార‌నేది తేల‌నుంది.

Also Read :  కేజ్రీవాల్ దేశానికి కాబోయే ప్ర‌ధాని

Leave A Reply

Your Email Id will not be published!