YS Jagan : ఏపీ సీఎం జగన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయంపై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు జగన్. నూతన విద్యా విధానంపై జగన్ రెడ్డి(YS Jagan )సమీక్ష జరిపారు.
పంతుళ్ల సేవలను బోధనేతర పనులకు వాడకూడదని స్పష్టం చేశారు. ఏ మాత్రం వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నత చదువులు చదివిన టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడు కోవాలని సూచించారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్రియా శీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈనెల 15 నుంచి నాడు నేడు రెండో విడత పనులు ప్రారంభిస్తామన్నారు. స్కూళ్లలో ప్రతి రోజూ విద్యార్థులకు ఒక ఇంగ్లీష్ పద్యాన్ని నేర్పించాలని సూచించారు సీఎం.
పదాలకు అర్థం చెప్పాలి. వాక్యాలు ఎలా రాయాలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది నుంచి 8వ తరగతిలో తప్పనిసరిగా డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాం ఉంటుందన్నారు.
ప్రతి మండలంలో ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ, ఒక మహిళా జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చి దిద్దాలని ఆదేశించారు సీఎం.
పిల్లల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చూడాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యత పంతుళ్లపైనే ఉందన్నారు జగన్ రెడ్డి. టీచర్లతో పాటు పేరెంట్స్ కూడా తమ పిల్లలు చదువుకునేలా చూడాలన్నారు.
హెచ్ఎంలు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలన్నారు. 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని ఆదేశించారు సీఎం.
Also Read : 10 ఏళ్లకు వయో పరిమితి పెంపు