Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని రీతిలో పంజాబ్ లో ఆధిక్యంలో దూసుకు పోతోంది. ఈ తరుణంలో పంజాబ్ ఆప్ కో కోఆర్డినేటర్ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఏం చెప్పామో వాటిని ప్రజలు పూర్తిగా నమ్మారని చెప్పారు.
ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా వస్తున్న సరళిని ఉద్దేశించి రాఘవ్ చద్దా(Raghav Chadha) మాట్లాడారు. ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తమ పార్టీ అభ్యర్థి భగవంత్ మాన్ పట్ల పంజాబ్ ప్రజలు పూర్తి నమ్మకాన్ని ఉంచారని చెప్పారు.
తాము ముందే చెప్పామని దానిని ప్రజలు ఆచరణలో చేసి చూపించారని పేర్కొన్నారు. గతంలో ఎలా ఉంటామో ఇప్పుడు కూడా అలాగే ఉంటామన్నారు.
గతంలో పాలకులు భవంతులలో నివసించారని, ఆస్తులు కూడ బెట్టుకోవడంలో ఫోకస్ పెట్టారని ఆరోపించారు. కానీ తాము సామాన్యులు, పేదలు, ప్రజల పట్ల ఉంటామని స్పష్టం చేశారు.
తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. తాము ఆస్తులు, నోట్లు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు రాఘవ్ చద్దా(Raghav Chadha). దైవం తమ పట్ల ఉందన్నారు. పంజాబ్ లో ఆప్ పవర్ లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని మరోసారి స్పష్టం చేశారు రాఘవ్ చద్దా. తాము ఎన్నికల సందర్భంగా ఏయే హామీలు ఇచ్చామో వాటిని ఆచరణలో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
ఆప్ ఆచరణకు నోచుకోని హామీలు ఎప్పుడూ ఇవ్వమన్నారు. ఆప్ ఇక నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఫోకస్ పెడతామన్నారు.
Also Read : కమలం వికసించేనా ఆప్ సత్తా చాటేనా