Pramod Sawant : గోవాలో బీజేపీదే అధికారం సావంత్ సీఎం

ఇండిపెండెంట్ల స‌హ‌కారంతో ప్ర‌భుత్వం

Pramod Sawant  : గోవా రాష్ట్రంలో ప్ర‌జ‌లు హంగ్ వైపు మొగ్గు చూపినా చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి రానుంది. ప్ర‌మాద్ సావంత్(Pramod Sawant )గోవా రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు.

దీంతో దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో బీజేపీ స‌త్తా చాటింది. మ‌రోసారి నాలుగు రాష్ట్రాల‌లో కాషాయా జెండాల‌ను పాతింది. ఈ మొత్తం విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది మాత్రం ఇద్ద‌రే ఒక‌రు ప్ర‌ధాని మోదీ మ‌రొక‌రు ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా.

ఇక చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది గోవా ఎన్నిక‌ల ఫ‌లితాలు. మొత్తం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ సీట్ల‌కు గాను భార‌తీయ జ‌న‌తా పార్టీ 20 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 12 సీట్ల‌లో గెలుపొందింది. ఇత‌రులు న‌లుగురు గెలుపొందారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్క‌డ త‌న ఖాతా తెరిచింది. ఇక్క‌డ రెండు సీట్లు గెలుపొందింది. ఆ పార్టీ ఏకంగా అన్ని రాష్ట్రాల‌లో బ‌రిలోకి దిగింది. ఊహించ‌ని రీతిలో పంజాబ్ లో అధికారంలోకి వ‌చ్చింది. అక్క‌డ అఖండ విజ‌యాన్ని నమోదు చేసింది.

92 సీట్లు సాధించి ఏకైక పార్టీగా అవ‌త‌రించింది. ఇక గోవా విష‌యానికి వ‌స్తే అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ కు కొన్ని సీట్లు త‌క్కువ ప‌డ్డాయి బీజీపింది. దీంతో ఆ పార్టీ సీనియ‌ర్లు రంగంలోకి దిగారు.

ఇండిపెండెంట్లతో సంప్ర‌దింపులు జ‌రిపారు. వారు స‌మ్మ‌తించ‌డంతో ప్ర‌భుత్వం ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయింది. దీంతో ప్ర‌మోద్ సావంత్ మ‌రోసారి సీఎం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది.

Also Read : ఆప్ విజ‌యం ప్ర‌ముఖులు ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!