Modi : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమున్నత భారతావని ఎంతో ఉత్కంతతో ఎదురు చూసిన ఈ ఎన్నికలు ఆశించిన మేరకు తాము అనుకున్నట్లుగానే వచ్చాయని చెప్పారు.
ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రసంగించారు ప్రధాని.
తాము తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలపై ప్రజలు నమ్మకం ఉంచారని అందుకే తమకు మరోసారి అధికారాన్ని అప్పగించారని పేర్కొన్నారు.
ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఓటు వేయని వారికి సైతం ఈ సందర్భంగా పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని మోదీ (Modiచెప్పారు.
ప్రజలు పూర్తి స్థాయిలో తమపై నమ్మకం ఉంచారని స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళలు, యువత పూర్తిగా తమ వైపు ఉన్నారనేది తేలిందన్నారు. ఇక గోవాలో ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వచ్చేలా చేశారని అన్నారు.
ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించడం చూస్తుంటే ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థం అవుతోందన్నారు.
విచిత్రం ఏమిటంటే యూపీలో ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించిన యోగికే మళ్లీ పట్టం కట్టారన్నారు. మీ అందరి నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని చెప్పారు.
ఇక రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఇదే రిపీట్ అవుతుందన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందేంత వరకు తాను నిద్ర పోనని ఈ సందర్భంగా ప్రకటించారు ప్రధాని.
Also Read : సీఎంను ఓడించిన సామాన్యుడు