Prashant Kishor : దేశంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలే వచ్చే 2024లో రిపీట్ అవుతాయని అన్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishor). ఆయన ప్రతిపక్షాలను తెలివిగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అలా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయవని, ఆ విషయం నరేంద్ర మోదీ తెలుసు కోవాలన్నారు. దేశం వేరు రాష్ట్రాల పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు.
ఒకవేళ బీజేపీ తమ సక్సెస్ గా భావిస్తే మరి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా త్రయం ప్రభావం పంజాబ్ లో ఎందుకు పని చేయలేదో చెప్పాలన్నారు.
వీరి చరిష్మా ఉండి ఉంటే ఉత్తరాఖండ్ లో సీఎంగా ఉన్న పుష్కర్ సింగ్ ధామీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతిలో ఎలా ఓడి పోతారని ప్రశ్నించారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మోదీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఉండదన్న విషయం మోదీకి తెలుసన్నారు.
కానీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన కు అంత సీన్ లేదని పేర్కొన్నారు ప్రశాంత్ కిశోర్.
మోదీ సర్జికల్ స్ట్రైక్ అనుకుంటున్నారు కానీ అంచనాలు తప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. మోదీ మాయ మాటల్లో పడవద్దని పీకే కోరారు.
Also Read : గెలుపు సరే రైతుల మాటేంటి