Mayawati : ప్ర‌జా తీర్పు శిరోధార్యం

స్ప‌ష్టం చేసిన మాయావ‌తి

Mayawati  : దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ముగిశాయి. దేశం అంతటా ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూసిన యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా వ‌చ్చాయి. యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండో సారి కొలువు తీర‌నుంది.

ఈ త‌రుణంలో గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఈసారి ఎన్నిక‌ల్లో పూర్తిగా త‌న ప‌ట్టు కోల్పోయింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

ఒక‌ప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ కేవ‌లం బీజేపీ, ఎస్పీ కొట్టిన దెబ్బ‌కు ఒకే ఒక్క సీటుతో స‌రి పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అంతే కాదు మ‌రో సుదీర్గ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ సైతం రెండు సీట్ల‌కు ప‌రిమితం కావడం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఒకింత విస్మ‌యానికి గురి చేశాయి.

ఇక స‌మాజ‌వ్ వాది పార్టీ ఆర్ఎల్డీ తో క‌లిసి పోటీ చేసింది. ఒక్క ఎస్పీకి 111 సీట్లు రాగా మిత్ర‌ప‌క్షాల‌కు క‌లిపి 14 సీట్లు వ‌చ్చాయి. ఇక బీజేపీకి 273 సీట్లలో గెలుపు బావుటా ఎగుర వేసింది.

ఇక ఈ ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయంగా ఓటు శాతాన్ని పెంచు కోగ‌లిగింది ఎస్పీ. కానీ సీట్ల‌ను చేజిక్కించు కోలేక పోయింది. త‌క్కువ తేడాతో కొన్ని సీట్లు కోల్పోవ‌డంతో ఆ పార్టీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

కాంగ్రెస్ పార్టీని చూస్తే ఆ పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ. కానీ కాంగ్రెస్ 2 సీట్ల‌కే ప‌రిమితం కాగా బీఎస్పీ ఒకే ఒక్క సీటుతో స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఈ ఫ‌లితాల‌పై బీఎస్పీ చీఫ్ మాయావ‌తి (Mayawati )స్పందించారు. నిరాశ ప‌డ‌వ‌ద్ద‌ని ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గుణ‌పాఠంగా మార్చుకుని ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు.

Also Read : మోదీ మాయ మాట‌ల్లో ప‌డ‌కండి

Leave A Reply

Your Email Id will not be published!