Congress Rebels : ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని వస్తున్నాం. విలువైన కాలాన్ని పార్టీ కోసం అంకితం చేశాం. కానీ ఎప్పుడూ లేనంతగా ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదని వాపోయారు కాంగ్రెస్ పార్టీకి(Congress Rebels )చెందిన సీనియర్లు.
గత సార్వత్రిక ఎన్నికల నుంచి నేటి దాకా ఎక్కడో ఒక చోట పార్టీకి దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్ , గోవా రాష్ట్రాలలో పార్టీ పూర్తిగా తన ప్రభావాన్ని చూపలేక పోయింది.
విచిత్రంగా గత ఎన్నికల్లో ఏడు సీట్లు కలిగిన యూపీలో ఈసారి రెండు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఫలితాలు రాలేదు.
ఇప్పటికైనా పార్టీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ పార్టీకి చెందిన సీనీయర్లు గులాం నబీ ఆజాద్, శశి థరూర్. ట్విట్టర్ (Congress Rebels )వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే ఎన్నడూ లేని స్థితిని ఇవాళ పార్టీ ఎదుర్కొంటోందన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అపజయం తమను కోలుకోలేకుండా చేసిందన్నారు ఆజాద్.
పార్టీలోని బలహీనతలు గురించి ఎత్తి చూపాం. సర్దు కోవాలని సూచించాం. కానీ పార్టీ తన తీరును మార్చు కోవడం లేదన్నారు. ఇక శశి థరూర్ అయితే మార్పు తో పాటు సంస్కరణలు కూడా అవసరమని స్పష్టం చేశారు.
ఈ మేరకు ట్వీట్ చేశారు. మోదీ, అమిత్ షాలకు ధీటుగా పోరాడే నాయకులే పార్టీలో లేకుండా పోయారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీ రాజ్ చౌహాన్.
ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పరాజయం పార్టీని కోలుకోలేకుండా చేసిందన్నది మాత్రం వాస్తవం.
Also Read : ప్రజా తీర్పు శిరోధార్యం