Sidhu : మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సంచలన కామెంట్స్ చేశాడు. పంజాబ్ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.
హై కమాండ్ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. కానీ ఎన్నడూ లేని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ గంప గుత్తగా ఊడ్చేసినంత పని చేసింది. మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా ఆప్ 92 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది.
విచిత్రం ఏమిటంటే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఆప్ దెబ్బకు ఇంటి బాట పట్టారు. వారిలో ప్రధానంగా మాజీ సీఎంలు చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ , పీసీసీ చీఫ్ సిద్దూ, అకాలీదళ్ నేతలు బాదల్, మజిథియా ఉన్నారు.
ఎన్నికల అనంతరం తొలిసారిగా నోరు విప్పారు పీసీసీ చీఫ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
వాళ్లు మొదటి నుంచీ మార్పు కోరుకున్నారని అలాగే తీర్పు ఇచ్చారని చెప్పారు. వారు ఎన్నటికీ తప్పు చేయమని ఈ దేశానికి ఓ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
కొత్త వ్యవస్థకు నాంది పలికిన ఈ అద్భుతమైన నిర్ణయం కోసం ప్రజలను తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజల స్వరం భగవంతుని గొంతుక. మనం వినయంతో అర్థం చేసుకోవాలని, దానికి నమస్కరించాలని అన్నారు సిద్దూ(Sidhu).
నేను ఓడి పోయినా పంజాబ్ లోనే ఉంటాను. ఈ భూమి నాది. ఈ ప్రజలు నా వాళ్లు. గెలుపు ఓటములు గురించి పట్టించుకోను అన్నాడు.
Also Read : భగవంత్ మాన్ కు భజ్జీ కితాబు