Amarinder Singh : పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమికి ప్రధాన కారణం గతంలో తొమ్మిది ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh)అని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.
దీనిపై పార్టీని వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన అమరీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన సుదీర్ఘ రాజకీయ కెరీర్ లో కంచు కోటగా భావిస్తూ వచ్చిన పాటియాలా నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ ఒక్క సీటు కూడా ఖాతా ఓపన్ చేయలేదు.
ఈ తరుణంలో తనపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు. ఆ పార్టీ కానీ , నాయకత్వం కానీ ఇంకా మార లేదని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రణ దీప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
తన హయాంలో పంజాబ్ ను అన్ని రంగాలలో టాప్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశానని చెప్పారు. అయితే పీసీసీ చీఫ్ సిద్దూ వల్లే పార్టీకి తీరని నష్టం వాటిల్లిదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎందుకంటే సిద్దూ వల్లనే కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పార్టీ సిద్దూకు సీఎం చాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీకి అవకాశం ఇచ్చింది.
పంజాబ్ లోనే కాదు అన్ని రాష్ట్రాలలో పూర్తిగా పరువు పోగొట్టుకుందని మండిపడ్డారు. చన్నీ, సిద్దూల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే ఆ పార్టీని కొంప ముంచిందని ఆరోపించారు.
Also Read : కాంగ్రెస్ వైఫల్యం సీనియర్ల భావోద్వేగం