Bhagwant Mann : పంజాబ్ లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ఇప్పటికే ప్రకటించింది.
ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ కేవలం ఎన్నికలలో భాగంగా ఆ పార్టీ చీఫ్ ప్రత్యేకంగా ఎవరు ఆప్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని పోల్ చేపట్టారు. ఇందులో అత్యధికంగా ప్రజలు మాన్ వైపు మొగ్గు చూపారు.
దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి పంజాబ్ లోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం రాష్ట్రంలో 117 సీట్లకు గాను ఆప్ 92 సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
2017లో 20 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటింది. ప్రధాన పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే మాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక ప్రకటన కూడా చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా సీఎం ఫోటో ఉండదన్నారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం రెండు ఫోటోలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకటి దేశం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్ ఇంకొకరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉంటాయని తెలిపాడు.
అంతే కాదు ప్రమాణ స్వీకారోత్సవం రాజ్ భవన్ లో ఉండదన్నారు. భగత్ సింగ్ పుట్టిన స్థలంలో జరుగుతుందని ప్రకటించాడు. ఇక ఈనెల 13న అమృత్ సర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టనుంది.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. 48 ఏళ్ల వయసు కలిగిన భగవంత్ మాన్ మొదట నటుడు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారారు.
Also Read : ప్రజలు మార్పు కోరుకున్నారు