Amit Shah : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. ఈ తరుణంలో ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీలను క్రైమ్ డేటా బేస్ లో చేర్చాలని స్పష్టం చేశారు. దీని వల్ల మరింత మేలు జరుగుతుందన్నారు.
99 శాతం పోలీస్ స్టేషన్ల డేటా బేస్ లను ఇప్పటికే నమోదు చేసింది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్స్ . ఇందులో ఆ ప్రధాన సంస్థలు కూడా చేరితే సమాచారం మరింత సులభంగా మారుతుందన్నారు అమిత్ షా(Amit Shah).
ఎన్సీఆర్బీ వేడుకల్లో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ ప్రకారం డేటాను , విశ్లేషించడం కాకుండా నేరాన్ని ప్రేరేపించే సామాజిక కారకాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగు పరుచుకునేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు షా. యాక్సెస్ డేటా నుంచి వివరాలు సేకరించడం, కీలక విభాగాలకు అందుబాటులో ఉంచేలా చూడడం ముఖ్యమన్నారు.
సరైన సమయంలో సరైన వ్యక్తి ఆయా డేటాను పొందే విధంగా యాక్సెస్ అన్నది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. డేటా అనాలిసిస్ కు సంబంధించి అత్యాధునికంగా ఉండాలని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా. అంతే కాకుండా విద్యా సంస్థలు, హాస్టళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
Also Read : నా సోదరుడు ప్రజల ఆశల్ని తీరుస్తాడు