Somnath Bharti : దేశంలో రాజకీయాలు శరవేగంగా మారి పోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే చాప కింద నీరులా దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డది. ఢిల్లీలో కొలువు తీరిన ఆప్ ఇప్పుడు మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంది.
ప్రధాన పార్టీలకు కంచుకోటగా ఉన్న పంజాబ్ లో అఖండ విజయంతో పాగా వేసింది. రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్ లో సైతం ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ప్లాన్ వర్కవుట్ చేస్తోంది.
పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇతర రాష్ట్రాలలో సైతం ఆప్ ను మరింత విస్తరించే పనిలో పడ్డారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఇక ఎలాంటి డబ్బులు, మద్యం, ప్రభావాలకు లోనుకుండా కేవలం సామానుల్యకే పట్టం కట్టే రీతిలో ఆప్ ప్లాన్ చేస్తోంది.
తాజాగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయంటోంది ఆప్. దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించాలని అనుకుంటోది. ప్రధానంగా తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారించాలని అనుకుంటోంది.
ఈ మేరకు యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు దక్షిణాది రాష్ట్రాల ఆప్ ఇన్ చార్జీ , ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి(Somnath Bharti ).
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఏప్రిల్ 14 నుంచి పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇందులో ప్రజా సమస్యలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ధర్మం, జాతి పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు ఆప్ విజయం ఓ కనువిప్పు అని పేర్కొన్నారు భారతి.
Also Read : రవిప్రకాష్‌పై చర్యలు తీసుకోండి