Bhagvant Mann Governor : గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన భ‌గ‌వంత్ మాన్

16న ఖ‌ట్క‌ర్ క‌లాన్ లో 12.30కు ప్ర‌మాణం

Bhagvant Mann Governor : పంజాబ్ ఆప్ సీఎం అభ్య‌ర్థిగా ఎంపికైన భ‌గ‌వంత్ మాన్ శ‌నివారం గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ప్ర‌భుత్వం ఏర్పాటుకు సిద్ద‌మై ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

ఈ మేర‌కు మాన్ విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. అనంత‌రం రాజ్ భ‌వ‌న్ ఎదుట భ‌గ‌వంత్ మాన్ (Bhagvant Mann Governor)మీడియాతో మాట్లాడారు. ఈనెల 16న పంజాబ్ లోని ఖ‌ట్క‌ర్ క‌లాన్ లో మ‌ధ్యాహ్నం 12. 30 గంట‌ల‌కు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా పంజాబ్ లోని ప్ర‌తి గ్రామం నుంచి ఈ దేశం కోసం ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ పుట్టిన ఖ‌ట్క‌ర్ క‌లాన్ కు వ‌స్తార‌ని తెలిపారు. భ‌గ‌త్ సింగ్ ఆశ‌యాల‌ను, ఆయ‌న చేసిన త్యాగాన్ని తాము స్మ‌రించుకుంటామ‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్.

అంత‌కు ముందు ఆయ‌న సీఎం కేజ్రీవాల్ ను క‌లిశారు. ఆ త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ప్ర‌మాణ స్వీకారం రోజే తెలుస్తుంద‌న్నారు.

ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌తి ఒక్క‌రిని ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. గెల‌పించిన ప్ర‌తి ఒక్క‌రికి మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు.

ఆయ‌న అంత‌కు ముందు ఆప్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్ర‌సంగించారు. పార్టీ కోసం ప‌ని చేసిన వారిని ఆద‌రించాలి. అంతే కాదు మ‌న‌కు ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయ‌ని వారు కూడా మ‌న ప్ర‌జ‌లేన‌ని గుర్తుంచు కోవాల‌ని అన్నారు.

రాజ‌ధానిలో కాకుండా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే ఎమ్మెల్యేలు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఫోటో ఉండ‌ద‌న్నారు. భ‌గ‌త్ సింగ్ , అంబేద్క‌ర్ ఫోటో ఉంటుంద‌న్నారు భ‌గ‌వంత్ మాన్.

Also Read : సిద్దూ కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!