Bhagwant Mann : భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

మాజీ ఎమ్మెల్యేల భ‌ద్ర‌త తొల‌గింపు

Bhagwant Mann : పంజాబ్ లో అఖండ విజ‌యాన్ని న‌మోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే త‌న‌దైన ముద్ర పాల‌న‌పై ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

తాను రాజ్ భ‌వ‌న్ లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించి అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. ఇక నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో సీఎం ఫోటో ఉండ‌ద‌న్నారు. పంజాబ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో అరుదైన వ్య‌క్తిగా ఆయ‌న నిలిచి పోయారు.

భార‌త దేశ స్వాతంత్ర విముక్తి కోసం ఉరి కొయ్య‌ల‌ను ముద్దాడిన ష‌హీద్ స‌ర్దార్ భ‌గ‌త్ సింగ్ స్వంత ఊరు ఖ‌ట్క‌ర్ క‌లాన్ లో ఈనెల 16న మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని వెల్ల‌డించారు.

అంతే కాదు ఇక నుంచి అన్ని ఆఫీసుల్లో భ‌గ‌త్ సింగ్, అంబేద్క‌ర్ ఫోటోలు ఉండాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో ఇవాళ రాజ్ భ‌వ‌న్ కు చేరుకుని గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ ను క‌లిసి ప్ర‌మాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ప‌నిలో ప‌నిగా త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు దిశా నిర్దేశం చేశారు. రాజ‌ధానిలో కాకుండా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో, త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఉండాల‌ని స్ప‌ష్టం చేశాడు భ‌గ‌వంత్ మాన్. ఇదే స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూతో స‌హా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భ‌ద్ర‌త‌ను శ‌నివారం తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

వీరిలో బాద‌ల్, అషు, ర‌జియా, ప‌ర్గ‌త్ సింగ్ , రాణా, సుఖ్ బింద‌ర్ , సంజ‌య్ త‌ల్వార్ , నాతూ రామ్ , ద‌ర్శ‌న్ లాల్ , ధ‌రంబీర్ , అరుణ్ నారంగ్ , త‌ర్లోచ‌న్ లు ఉన్నారు. అంతే కాకుండా పంజాబ్ నూత‌న ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీగా వేణు ప్ర‌సాద్ ను నియ‌మించారు.

Also Read : గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!