Muralidhar Rao : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు (Muralidhar Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో తమ పార్టీ విజయ ఢంకా మోగించిందన్నారు.
ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అయితే బీజేపీ అఖండ గెలుపును సీఎం కేసీఆర్ జీర్ణించు కోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయనకు చలి జ్వరం పట్టుకుందన్నారు.
వెంటనే తట్టుకోలేక యశోద ఆస్పత్రికి చెకప్ కోసం బయలు దేరారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ శాశ్వతంగా ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫ్రంట్ లేదు టెంట్ లేదన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా దేశంలో అక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గంప గుత్తగా విలువైన వేలాది ఎకరాలను టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని తాము పవర్ లోకి వచ్చాక వాటిని తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తాము గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు గులాబీని తిరస్కరించడం మొదలు పెట్టారని చెప్పారు.
తమ పార్టీ దెబ్బకు అన్ని పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని , కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉందన్నారు. ఏది ఏమైనా పోలీసులు అదుపు తప్పడం మంచి పద్దతి కాదన్నారు.
అసెంబ్లీలో మాట్లాడనీయకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు.
Also Read : మధ్యవర్తిత్వం సమస్యలకు పరిష్కారం