TTD : కరోనా మెల మెల్లగా తగ్గుముఖం పట్టడంతో భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు బారులు తీరారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలని టీటీడీ(TTD )ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి , ఈవో జవహర్ రెడ్డి కోవిడ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ పూర్తయిన సర్టిఫికెట్ విధిగా సమర్పించాలని సూచించారు.
కరోనా కాస్త తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ అమ్మ వార్లను చూసేందుకు, దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
గతంలో శ్రీవారి మెట్ల ద్వారా నడిచి వచ్చే భక్తులకు నేరుగా దర్శనం లభించేది. కానీ ఇటీవల భారీ వర్షాల దెబ్బకు ఆ మెట్లను మూసి వేశారు. ప్రస్తుతం అలిపిరి మెట్ల ద్వారా మాత్రమే భక్తులను అనుమతి ఇస్తున్నారు.
అయితే రూ. 300 టికెట్లు తీసుకున్న సర్వదర్శనం కలిగిన టోకెట్లు ఉన్న వారికి మాత్రమే నడిచేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. ఈ తరుణంలో టీటీడీ(TTD )అనుసరిస్తున్న పద్దతులు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా చేస్తాయి.
ఇక నిన్న ఒక్క రోజే ఏకంగా 75 వేల 775 మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 36 వేల 474 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం రూ. 3.7 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
Also Read : దర్శనం కోసం భక్తుల అగచాట్లు