Radha Krishna Kumar : డార్లింగ్ ప్రభాస్ , లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన రాధే శ్యామ్ విడుదలై ఆదరణ చూరగొంటోంది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్(Radha Krishna Kumar) దృశ్య కావ్యంగా మలిచాడని సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రత్యేకించి తీసిన సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఓవర్సీస్ లో సూపర టాక్ తెచ్చుకుంది.
పూర్తిగా హాలీవుడ్ ను తలదన్నేలా ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దేలా ప్రయత్నం చేశారు దర్శకుడు. 1970లో జరిగిన యధార్థ ప్రేమక కథ ఇది. యువీ క్రియేషన్స్ నిర్మించింది. భారీ బడ్జెట్ తో ఎక్కువ కాలం సినిమా కోసం కష్టపడ్డాడు ప్రభాస్.
భారీ ఎత్తున వసూళ్లు చేస్తూ ముందుకు సాగుతోంది రాధే శ్యామ్ మూవీ. మూవీ సక్సెస్ టాక్ తెచ్చు కోవడంతో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మీడియాతో మాట్లాడారు.
రాధే శ్యామ్ ను తీసే కంటే ముందు ఎన్నో ఏళ్లుగా కథ రాసుకున్నా. దీనిని ముందుగా ప్రభాస్ కు వినిపించిన తక్షణమే ఓకే చెప్పారు. ఈ మూవీ ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
రాధే శ్యామ్ ను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాం. ఇది పూర్తిగా సినిమా కాదు దృశ్య కావ్యం అని పేర్కొన్నారు డైరెక్టర్ . ఇది పూర్తిగా డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రేమ, భావోద్వేగాలను మరింత ఉన్నతంగా తెర మీద ప్రతిఫలించేలా చేశామన్నారు.
కథకు తగ్గట్టు అద్భుతంగా సంగీతం అందించారు జస్టిన్ ప్రభాకరన్. ఇక గుండెల్ని పిండేసేలా థమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక ఇచ్చారంటూ కితాబు ఇచ్చారు రాధాకృష్ణ కుమార్.
Also Read : చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నామీరే