Bhagwant Mann : పంజాబ్ లో అఖండ మెజారిటీని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం అమృత్ సర్ లో భారీ రోడ్ షోను నిర్వహిస్తోంది.
ఊహించని రీతిలో విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియ చేసేందుకు గాను ఈ షో స్టార్ట్ అయ్యింది. మొత్తం 117 సీట్లకు గాను పవర్ లో ఉన్న కాంగ్రెస పార్టీని పూర్తిగా తుడిచి పెట్టింది చీపురు గుర్తు కలిగిన ఆప్.
ఏకంగా 60 ఏళ్ల పంజాబ్ చరిత్రను తిరగ రాస్తూ 92 సీట్లు గెలుపొందింది. సామాన్యుల దెబ్బకు ప్రధాన పార్టీలన్నీ ఇంటి బాట పట్టాయి.
రోడ్ షో నిర్వహించే కంటే ముందు పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ ఢిల్లీకి వెళ్లి పంజాబ్ కు రావాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. ఇవాళ సీఎం కేజ్రీవాల్ కు సాదర స్వాగతం పలికారు భగవంత్ మాన్(Bhagwant Mann ).
అక్కడి నుంచి నేరుగా దేశంలో అత్యంత పేరెన్నికగన్న అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి నగరంలో భారీ రోడ్ షో చేపట్టారు.
ఈ షో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈనెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ రిజల్ట్స్ దెబ్బకు అతిరథ మహారథులు ఖంగు తిన్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ , చన్నీ, సిద్దూ, మజిథియా, ప్రకాశ్ సింగ్ బాదల్ మట్టి కరిచారు. గెలుపొందిన ఎమ్మెల్యేలతో కలిసి గోల్డెన్ టెంపు ల్ ను సందర్శించి అర్దాలు సమర్పించారు.
Also Read : సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్