Adhir Ranjan Chowdhury : దేశం లోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ పార్టీ పనై పోయిందని, ఇక దానికి భవిష్యత్తు లేదని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస పార్టీ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ సోయి లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఆమె భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని టీఎంసీ ఎక్కడుందో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్బంగా దేశంలోని ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల శాతం ఉందన్నారు.
20 శాతం ఓటు బ్యాంకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడటం దీదీకి అలవాటుగా మారిందన్నారు. రాజకీయాల్లో మమతా బెనర్జీ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు అధిర్ రంజన్ చౌదరి.
రోజుకో మాట మాట్లాడుతూ ఒక రకంగా బీజేపీకి మేలు చేకూర్చేలా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. ఇంకోసారి అవాకులు చెవాకులు పేలకుండా ఉండాలని సూచించారు. తమ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు.
బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు మమతా బెనర్జీ ఇలా వ్యవహరిస్తూ , మాట్లాడుతోందంటూ మండిపడ్డారు అధిర్ రంజన్ చౌదరి. ప్రతిపక్షాల ఓట్ల కంటే తమ ఓట్లే అత్యధికం అని గుర్తుంచుకుని మాట్లాడాలని సూచించారు. ఆమె మాటల్ని ఎవరూ నమ్మరన్నారు.
Also Read : సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్