Modi : దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం చేపట్టారు. ఈ కీలక భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాత్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ , ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
వీరితో పాటు దేశంలో కీలక రంగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు సైతం హాజరయ్యారు. మరో వైపు ఉక్రెయిన్ పై యుద్దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది రష్యా. దేశ భద్రత, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఆయిల్ పెట్రోల్ ధరల పెంపు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
రష్యా, ఉక్రెయిన్ ఇరు దేశాలతో భారత్ సత్ సంబంధాలు ఇప్పటి దాకా కొనసాగిస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ(Modi )ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రధానంగా ఆయన భారత్ ఎప్పుడూ యుద్దం కోరుకోదన్నారు. శాంతి తమ అభిమతని ప్రతి దేశం తన ఐడెంటిటిని కలిగి ఉండాలని కోరుకుంటుందన్నారు. విచిత్రం ఏమిటంటే విపక్షాలు మోదీని ఏకి పారేశాయి.
ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రధానమంత్రి యుద్ద ప్రాతిపదికన నిర్ణయం తీసుకోక పోవడం వల్లనే విద్యార్థులను సకాలంలో స్వదేశానికి తీసుకు రాలేక పోయారని మండి పడ్డారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.
ఇదే సమయంలో బాధిత విద్యార్థులు సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. చని పోయాక గులాబీలు ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ గా రాహుల్ గాంధీ ఉండాలి