CWC Meeting : ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం ముగిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో(CWC Meeting) ప్రధాన అంశాలపై చర్చించారు.
ప్రత్యేకించి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై ఎక్కువగా చర్చకు వచ్చినట్లు సమాచారం. పంజాబ్ లో ఎదురైన ఓటమి, గులాం నబీ ఆజాద్ నివాసంలో అసమ్మతి నేతలు భేటీ కావడంపై కూడా చర్చకు వచ్చింది.
ఇదిలా ఉండగా ముకుల్ వాస్నిక్ ను పార్టీ చీఫ్ గా ప్రకటించాలని జీ23 కాంగ్రెస్ అసమ్మతి నేతలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సోనియాతో పాటు రాహుల్ గాంధీ, చిదంబరం, మల్లికార్జున్ ఖర్గే , అంబికా సోనీ, ప్రియాంకా వాద్రా , గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు.
అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ (CWC Meeting)తో పాటు ఏకే ఆంటోనీ హాజరు కాలేదు.
వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీకి చెందిన సీనియర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఐదు రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జీలు పాల్గొన్నారు.
రెండు గంటలకు పైగా ఈ మీటింగ్ జరిగింది. పార్టీని సంస్థాగతపరంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా ఏఐసీసీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నాయకులు, అభిమానులు రాహుల్ గాంధీని పార్టీ చీఫ్ గా ఎంపిక చేయాలని నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా పార్టీ సమావేశం జరిగే కంటే ముందు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని పార్టీ చీఫ్ చేయాలని ఆయన కోరారు.
Also Read : గోవాలో మార్పు మొదలైంది