Sonia Gandhi : మేడం స‌న్న‌ద్దం పార్టీ అభ్యంత‌రం

సీడ‌బ్ల్యూసీ మీటింగ్ గ‌రం గ‌రం

Sonia Gandhi : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌కు తెర తీసిన కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ మీటింగ్ (Sonia Gandhi) ముగిసింది. ప్ర‌ధానంగా ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ప‌రాజ‌యం మూట గ‌ట్టుకుంది. ఎక్క‌డా గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక పోయింది.

దీనిపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. గ‌త కొంత కాలంగా అస‌మ్మ‌తి నేత‌లంతా క‌లిసి జీ-23 మీటింగ్ పెట్టారు. ఇందులో గులాం న‌బీ ఆజాద్ , క‌పిల్ సిబ‌ల్ లాంటి వాళ్లున్నారు. పార్టీ నాయ‌క‌త్వం మారాల‌ని కోరుతున్నారు.

అదే ప్ర‌ధాన డిమాండ్ గా పేర్కొంటున్నారు. ఆజాద్ ను అడ్డం పెట్టుకుని పార్టీలో అంత‌ర్గ‌త పోరుకు ప్ర‌య‌త్నించేలా బీజేపీ ఎగ దోస్తోంద‌న్న అనుమానం ఆ పార్టీకి చెందిన వారే ఆరోపిస్తున్నారు.

ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లను టార్గెట్ చేశారు. భారీ ఎత్తున క‌ష్ట‌ప‌డ్డారు. కానీ ఫ‌లితం కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

ఈ త‌రుణంలో నిన్న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో తాత్కాలిక అధ్య‌క్షురాలిగా ఉన్న సోనియా గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ద‌మైన‌ట్లు ఆమె నిర్ణ‌యాన్ని తాము ఒప్పుకోబోమంటూ పెద్ద ఎత్తున నాయ‌కులు చెక‌ప్పిన‌ట్లు టాక్.

ఇదే విష‌యాన్ని ఆ పార్టీకి చెందిన అధికార ప్ర‌తినిధి కేసీ వేణుగోపాల్ ధ్రువీక‌రించారు కూడా. కాగా వ‌చ్చే ఆగ‌స్టు 20న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చీఫ్ ను ఎన్నుకోవాల‌ని తీర్మానం చేశారు.

అంత వ‌ర‌కు సోనియానే ఉండాల‌ని నిర్ణ‌యించారు. మ‌రో వైపు రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ లో చింత‌న్ బైఠ‌క్ నిర్వ‌హించేందుకు డిసైడ్ చేశారు.

Also Read : గోవాలో మార్పు మొద‌లైంది

Leave A Reply

Your Email Id will not be published!