Farmers Protest : యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిన రైతు ఉద్యమం(Farmers Protest )మళ్లీ ప్రారంభం కానుందా. అవుననే అంటోంది సంయుక్త కిసాన మోర్చా.
ఏడాదికి పైగా సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సాగించిన రైతు పోరాటానికి నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తున్న మోదీ సర్కార్ తలవంచింది.
ఎన్నికల సందర్భంగా తాము తీసుకు వచ్చిన చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. పార్లమెంట్ లో సైతం ప్రవేశ పెట్టారు. రాష్ట్రప్రతి సైతం బిల్లు రద్దుపై సంతకం చేశారు.
ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ముగిశాయి. యూపీలో బీజేపీ పవర్ లోకి వచ్చింది. చట్టాలు రద్దు చేసిన ప్రభుత్వం రైతులు(Farmers Protest )కోరిన డిమాండ్లను ఈరోజు వరకు పరిష్కరించ లేదు.
దీనిపై మరోసారి ఉద్యమించే విషయంపై చర్చించేందుకు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది సంయుక్త కిసాన్ మోర్చా. గత ఏడాది నవంబర్ లో ప్రధాన మంత్రికి సమర్పించిన ప్రధాన డిమాండ్లలో ఏ ఒక్కటీ తీర్చ లేదు మోదీ సర్కార్.
ఈ తరుణంలో పోరాటాన్ని తిరిగి ప్రారంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ తికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమ ప్రధాన డిమాండ్లు తీర్చాలని అవి తీరనంత వరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.
పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించు కోవాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.
Also Read : చట్టం ముందు అంతా సమానమే