Sushil Modi : వంశ పారంప‌ర్య రాజ‌కీయ‌లు క్లోజ్

బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ కామెంట్

Sushil Modi : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ సుశీల్ మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధానంగా ఆ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీపై నిప్పులు చెరిగారు. యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను తప్పు దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు.

ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. ఫ‌లితాలు వ‌చ్చాయి. నాలుగు రాష్ట్రాల‌లో మ‌రోసారి బీజేపీ త‌న అధికారాన్ని నిల‌బెట్టుకోగా పంజాబ్ లో ఉన్న ప‌వ‌ర్ ను కోల్పోయింది కాంగ్రెస్. ఈ సంద‌ర్భంగా వ‌రుస ట్వీట్ల‌తో సుశీల్ మోదీ తో విరుచుకు ప‌డుతున్నారు.

బీహార్ కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న కాంగ్రెస్ ను ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. కాంగ్రెస్ అవినీతి, వంశ పారంప‌ర్య రాజ‌కీయాలు చేస్తోందంటూ ఆరోపించారు మోదీ.

గ‌తంలో 7 సీట్లు ఉండేవ‌ని కానీ ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని రెండు సీట్ల‌కే ప‌రిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు. రాజ‌కీయంగా కీల‌కంగా ఉన్న యూపీలో ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చార‌ని కానీ కాంగ్రెస్ మాట‌ల‌ను నమ్మ లేద‌న్నారు.

దిమ్మ తిరిగే స‌మాధానం ఓట్ల రూపంలో చూపించార‌ని పేర్కొన్నాడు. నేను మ‌హిళ‌ను పోరాడ‌గ‌ల‌ను అనే నినాదంతో మ‌హిళ‌ల మ‌ధ్య పొర‌పొచ్చాలు చేసేందుకు య‌త్నించే ప్ర‌య‌త్నం చేసిందంటూ(Sushil Modi )ఆరోపించారు.

కేవ‌లం రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైన ఆమెను ఆ పార్టీకి చెందిన వారు ఎందుకు రాజీనామా చేయాల‌ని అడ‌గ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా, రాహుల్ గాంధీల‌పై కూడా విరుచుకు ప‌డ్డారు సుశీల్ మోదీ. పార్టీని కాపాడుకుంటే బెట‌ర్ అని సూచించారు.

Also Read : ఉప ఎన్నిక‌ల బ‌రిలో సిన్హా..సుప్రియో

Leave A Reply

Your Email Id will not be published!