Modi Lok Sabha : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. మరోసారి నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగుర వేసింది. పంజాబ్ లో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.
అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. 60 ఏళ్ల చరిత్ర ను తిరగ రాసింది. ఇక ఈసారి ఎన్నికలు తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, ఇదే తాము రెఫరెండమ్ గా భావిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ప్రకటిస్తూ వచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అధికార పక్షమే కాదు విపక్షాలు సైతం మోదీ నాయకత్వంలోని బీజేపీ సాధించిన విజయాలను చూసి విస్తు పోతోంది. ఇవాళ ప్రత్యేకించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు , ఎంపీ శశి థరూర్ సైతం మోదీని(Modi Lok Sabha )ప్రశంసించడం విశేషం.
ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలలో బీజేపీని మరోసారి పవర్ లోకి తీసుకు వచ్చేలా చేసిన ఘనత ప్రధానిదేనంటూ ఆ పార్టీకి చెందిన సభ్యులు ముక్త కంఠంతో మోదీ అంటూ నినదించారు.
ఇవాళ లోక్ సభలోకు ఎంటరైన ప్రధాన మంత్రికి పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ నే పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. దీంతో సంభా ప్రాంగణం అంతా మోదీ పేరుతో దద్దరిల్లి పోయింది.
ఎప్పటి లాగే మోదీ విజయ గర్వంతో తనకు కేటాయించిన పీఎం ప్లేస్ లో ఆసీనులయ్యారు. బడ్జెట్ సెషన్ రెండో సెషన్ లో లోక్ సభలోకి వచ్చారు ప్రధానమంత్రి మోదీ. పెద్ద ఎత్తున బల్లలు చరుస్తూ మోదీకి స్వాగతం పలకడం విశేషం.
Also Read : వంశ పారంపర్య రాజకీయలు క్లోజ్