KTR : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి చైర్మన్ గా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కౌన్సిల్ లో మాట్లాడారు.
ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రైతు బిడ్డ. శాసనసభ స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరూ అన్నదాత బిడ్డలు ఉన్నారని గుర్తు చేశారు.
రైతు బిడ్డలే అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండటం ఈ రాష్ట్ర అదృష్టమన్నారు. రైతులందరి పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని కేటీఆర్ (KTR)అన్నారు.
వార్డు సభ్యుడి నుంచి నేడు మండలి చైర్మన్ లాంటి ఉన్నత పదవికి చేరుకున్నారంటూ గుత్తాను ప్రశంసించారు. మూడు సార్లు ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తో గుత్తా కలిసి ప్రయాణం చేస్తూ వచ్చారని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ ఒక్కడి వల్లే సాధ్యమైందన్నారు. నల్లగొండ జిల్లాలో నెలకొన్న ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందామన్నారు. ఇక రైతు సమన్వయ సమితి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు.
అపారమైన అనుభవం కలిగిన గుత్తా సారథ్యంలో శాసనమండలి కొనసాగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఐటీ హబ్, ఫార్మా హబ్, అగ్రి హబ్ గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆధర్శంగా మారిందన్నారు కేటీఆర్.
Also Read : దమ్ముంటే కరెంట్ కట్ చేయి