KTR : ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆరు నెలల పాటు యువత విలువైన కాలాన్ని వ్యర్థం చేయొద్దని సూచించారు.
సినిమాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండండని అన్నారు. హైదరాబాద్ లో ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. అభ్యర్థులు వదంతలు , పైరవీలను నమ్మవద్దని కోరారు.
ఒక్కసారి జాబ్ వస్తే జీవితాంతం నిశ్చింతగా ఉండవచ్చన్నారు. ఫోన్ లో ట్విట్టర్, వాట్సాప్ , లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ , యూట్యూబ్ , ఇన్ స్టా గ్రామ్ లను చూడటం తగ్గగించు కోవాలని అన్నారు.
మీకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కేటీఆర్(KTR). విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 20 ఏళ్ల పాటు 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు.
ఉచితంగా మెటీరియల్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. పోటీ పడే స్థాయికి మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. 13 వేల ఇండస్ట్రీస్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని, మరో 6 వేల పరిశ్రమలు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పారు మంత్రి కేటీఆర్.
విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారతపై ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ హబ్ గా , ఫార్మా హబ్ గా , అగ్రి హబ్ గా మారిందన్నారు. ఇప్పటికైనా సమయం విలువ గుర్తించి ప్రిపేర్ కావాలని సూచించారు.
Also Read : ఏపీ విద్యా రంగం దేశానికి ఆదర్శం