Ashish Mishra : ఆశిష్ మిశ్రా బెయిల్ మంజూరుపై విచార‌ణ‌

సుప్రీంలో రైతు బాధిత కుటుంబాల పిటిష‌న్

Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన యూపీ లోని ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిష్ మిశ్రా కు బెయిల్ మంజూరు చేసింది అల‌హాబాద్ కోర్టు.

దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 10న హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను చ‌ని పోయిన రైతుల కుటుంబ స‌భ్యులు స‌వాల్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతుల‌తో స‌హా ఎనిమిది మందిని చంపిన కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఆశిష్ మిశ్రాకు(  Ashish Mishra) బెయిల్ మంజూరు చేసింది.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలియ చేస్తూ కోర్టుకు ఎక్కారు. బాధిత కుటుంబాల త‌ర‌పున న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ వాదిస్తున్నారు. కేసుకు సంబంధించిన ప్ర‌ధాన సాక్షుల‌తో ఒక‌రిపై దాడి జ‌రిగింద‌ని కోర్టుకు గ‌తంలో దాడి జ‌రిగింద‌ని కోర్టుకు ఇప్ప‌టికే విన్న‌వించారు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ (ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ) విచార‌ణ చేసింద‌ని, ఇందులో మంత్రి త‌న‌యుడి ప్ర‌మేయం ఉందంటూ పేర్కొంది. ఈ త‌రుణంలో మిశ్రాకు ఎలా బెయిల్ ఇస్తారంటూ నిల‌దీశారు.

హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌డాన్ని చ‌ట్టంలో నిల‌క‌డ లేనిదిగా అభివ‌ర్ణించారు. నిందితుడి తండ్రి అజ‌య్ మిశ్రా కేంద్ర ప్ర‌భుత్వంలోని కేబినెట్ లో మంత్రిగా ఉన్నార‌ని, దానిపై ప్ర‌భావం చూపుతున్నారంటూ ఆరోపించారు. ప్ర‌స్తుతం కోర్టు ఏం చెబుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!