Ned Price Missile : సాంకేతిక లోపం మిస్సైల్ ప్ర‌యోగం

అనుకోకుండా జ‌రిగింద‌న్న భార‌త్

Ned Price Missile : భార‌త్ కు సంబంధించిన మిస్సైల్ (క్షిప‌ణి ) అనుకోకుండా పాకిస్తాన్ లో పేలింది. ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

ఒక వేళ ప్ర‌మాద‌వ‌శాత్తు కాక పోయి ఉండి వుంటే భార‌త్ పై యుద్దం ప్ర‌క‌టించి ఉండేవార‌మ‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫోక‌స్ పెట్ట‌డంతో దీనిపై మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అమెరికా దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

భార‌త దేశం నుంచి వ‌చ్చిన క్షిప‌ణి ప్ర‌మాద‌వ‌శాత్తు (Ned Price Missile)పేలింద‌ని కావాల‌ని చేసింది కాద‌ని ఇప్ప‌టికే స‌ర్కార్ తెలియ చేసింద‌ని అమెరికా తెలిపింది.

రెండు రోజుల కింద‌ట శుక్ర‌వారం ప్ర‌మాద‌వ‌శాత్తు చోటు చేసుకుందే త‌ప్పా కావాల‌ని చేసిందేమీ లేద‌ని ఇప్ప‌టికే ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్ల‌డించారు. సాంకేతిక లోపం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ప్ర‌క‌టించారు.

దీనిని కంటిన్యూ చేస్తూ భార‌త్ నుంచి వ‌చ్చిన క్షిప‌ణి (Ned Price Missile)పాకిస్తాన్ లో ప‌డి పోవ‌డం కావాల‌ని జ‌రిగింది కాద‌ని ప్ర‌మాద‌వ‌శాత్తు త‌ప్ప మ‌రేమీ లేద‌ని యూఎస్ పేర్కొంది.

పాకిస్తాన్ లో ల్యాండ్ అయిన క్షిప‌ణిని పేల్చామ‌ని, అది కావాల‌ని చేసింది కాదంటూ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ ఘ‌ట‌న ప్ర‌మాదం త‌ప్ప మ‌రేదైనా అనుకునేందుకు ఏమీ లేద‌న్నారు యూఎస్ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి నెడ్ ప్రైస్ .

Also Read : మూడు దేశాల సయోధ్య విఫలం…రష్యా వితండవాదం

Leave A Reply

Your Email Id will not be published!