Hijab Row HC : హిజాబ్ ధ‌రించ‌డం త‌ప్పనిస‌రి కాదు

క‌ర్ణాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Hijab Row HC : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న క‌ర్ణాట‌క హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇవాళ ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. హిజాబ్ ధ‌రించ‌డం అన్న‌ది త‌ప్ప‌నిస‌రి మ‌త ప‌ర‌మైన ఆచారం కాద‌ని తీర్పు చెప్పింది.

విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ పై నిషేధాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఈ కేసుకు సంబంధించి చీఫ్ జ‌స్టిస్ రీతూ రాజ్ తవ‌స్తీ, జ‌స్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జ‌స్టిస్ జేఎం ఖాజీల‌తో(Hijab Row HC) కూడిన ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విచారించింది.

రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ప్ర‌భుత్వ బాలిక‌ల పీయూ కాలేజీలో కొంత మంది విద్యార్థులు త‌మ‌ను త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కాకుండా నిరోధించార‌ని ఆరోపించారు.

దీంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో క‌ర్ణాట‌క‌లో హిజాబ్ ధ‌రించ‌డం త‌మ హక్కు అంటూ నిర‌స‌న‌లు , ఆందోళ‌న‌లు పెద్ద ఎత్తున ప్రారంభ‌మ‌య్యాయి.

హిజాబ్ వివాదం దేశాన్నే కాదు ప్ర‌పంచాన్ని సైతం విస్తు పోయేలా చేసింది. దీనిపై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సీరియ‌స్ అయ్యారు.

తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు ఎవ‌రూ ఈ అంశంపై జోక్యం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు. యావ‌త్ భార‌తం క‌ర్ణాట‌క హైకోర్టు ధ‌ర్మాస‌నం ఏం తీర్పు వెలువ‌రిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించింది.

ఇదిలా ఉండ‌గా విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ నిషేధాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన వివిధ పిటిష‌న్ల‌ను క‌ర్ణాట‌క హైకోర్టు ఇవాళ కొట్టి వేసింది. ఏ దుస్తులు ధ‌రించాల‌న్న‌ది త‌మ వ్య‌క్తిగ‌త‌మ‌ని కానీ విద్యా సంస్థ‌ల్లో అంతా స‌మాన‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : గాంధీ ఫ్యామిలీ వ‌ల్ల‌నే ఓట‌మి

Leave A Reply

Your Email Id will not be published!