Rajnath Singh : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన భారత్ మిస్సైల్ పాక్ భూభాగంలో కూలిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
తప్పయిందని ఒప్పుకున్నందుకు ఊరుకున్నామని లేక పోతే యుద్దానికి దిగే వారమని, సరైన రీతిలో సమాధానం ఇచ్చే వారమని వార్నింగ్ ఇచ్చారు. ఈ తరుణంలో కేంద్ర సర్కార్ స్పందించింది. పొరపాటున జరిగిందని ఒప్పుకుంది.
మిస్సైల్ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈనెల 9న రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు.
మిస్సైల్ యూనిట్ లో రోజూ వారీ తనిఖీ లు చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, కావాలని చేసింది కాదన్నారు రాజ్ నాథ్ సింగ్.
దీనికి సంబంధించి విచారణకు కూడా ఆదేశించామని వెల్లడంచారు కేంద్ర మంత్రి. భారత క్షిపణి వ్యవస్థపై ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదన్నారు.
మన వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. దేశ భద్రత పరంగా సురక్షితమైదని స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh).
ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య 2005 ఒప్పందం ప్రకారం ముందస్తు సమాచారం ఉండాలన్నారు. ఎందుకు జరిగిందనే దానిపై పూర్తి నివేదిక వస్తుందన్నారు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని ఇండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు