YS Jagan : ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇవాళ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా (AP CM) (Jagan Mohan Reddy) (YS Jagan )సంచలన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు నాయుడు విష ప్రచారం మానుకోవాలన్నారు. ఎంత సేపూ అర్థం చేసుకోకుండా పదే పదే సమావేశాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని జగన్ సూచించారు.
సభకు సంబంధించి హుందాగా ఎమ్మెల్యేలు ప్రవర్తించడం నేర్చు కోవాలన్నారు. ఏవైనా సమస్యలు, లేదా అంశాలు ఉంటే ప్రశ్నించే ఛాన్స్ ఉండనే ఉంటుందన్నారు. కానీ కావాలని అడ్డుకోవాలని చూడడం(YS Jagan )దారుణమన్నారు.
55 వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా తయారు చేస్తారా అని (Jagan Reddy) ప్రశ్నించారు. ప్రతి సారి ప్రజలు పదే పదే టీడీపీని తిరస్కరిస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబులో, టీడీపీలో మార్పు రాలేదన్నారు.
ఏవైనా ఆరోపణలు చేసినా లేదా విమర్శలు చేసినా దానికి తగినట్టుగా ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. సారాపై తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు 13 వేల కేసులను నమోదు చేశామని వెల్లడించారు సీఎం.
సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జంగారెడ్డి ఘటనపై సీరియస్ అయ్యారు (Jagan Reddy). ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ చేశామన్నారు.
Also Read : టీడీపీ సభ్యుల తీరుపై బుగ్గన ఫైర్