Owaisi : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటక హిజాబ్ వివాదానికి సంబంధించి ఇవాళ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ముగ్గురు సభ్యులతో కూడిన సర్వోన్నత ధర్మాసనం ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ అన్నది ఇస్లాం మతంలో తప్పనిసరిగా ధరించాలన్న రూల్ ఏమీ లేదని పేర్కొంది.
అంతే కాదు విద్యా సంస్థలలో ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. హిజాబ్ ధరింపు అన్నది తప్పనిసరి కాదని తీర్పు చెప్పింది. 200 పేజీల తీర్పు నివేదికతో కూడిన తీర్పు ప్రకటించింది.
యావత్ దేశం ఒక్కసారిగా ఫోకస్ పెట్టిన ఈ తీర్పు ఒక రకంగా భారత దేశ న్యాయ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించక తప్పదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై తాజాగా ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Owaisi )స్పందించారు. 15 పాయింట్లను లేవనెత్తుతూ ట్వీట్ చేశారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది ఉందంటూ పేర్కొన్నారు.
తనకు న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేశారు ఓవైసీ. సంస్కృతి, స్వేచ్ఛ, భావ ప్రకటన రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15 లాంటి వాటిని తోసినట్లేనని పేర్కొన్నారు.
ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెందిన మహిళల మీద ఈ తీర్పు అత్యంత ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైసీ(Owaisi ).
వాళ్లు టార్గెట్ గా మారే అవకాశం ఉందన్నారు. పిటిషనర్లు సుప్రీంకోర్టు ముందు అప్పీలు చేస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read : పొరపాటున పాక్ లో మిస్సైల్ కూలింది