CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన 740 మంది విద్యార్థులకు ఖుష్ ఖబర్ చెప్పారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఎన్నో కష్టాలు పడి వైద్య విద్య కోసం ఉక్రెయిన్ కు వెళ్లారు.
అక్కడ ప్రస్తుతం యుద్దం నడుస్తోంది. ఇక భవిష్యత్తులో కూడా చదువుకునే వీలు లేదు. దీంతో అక్కడే చిక్కుకు పోయి ఇటీవల నానా కష్టాలు పడుతూ స్వస్థాలలకు చేరుకున్న తెలంగాణ వైద్య విద్యార్థులను ఆదుకుంటామని ప్రకటించారు.
ఇవాళ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రసంగించారు. అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రానికి చెందిన 740 మంది ఉక్రెయిన్ నుంచి ఇక్కడికి వచ్చారని, వారు చదువుకునేందుకు తమ ప్రభుత్వం బేషరతుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ నుంచి కేంద్ర సర్కార్ 18 వేల మందికి పైగా విద్యార్థులను దేశానికి తరలించింది. వారిలో ఎక్కువ శాతం వైద్య విద్యను చదివేందుకు వెళ్లిన వారే ఉన్నారు.
ఇదిలా ఉండగా భారత దేశంలో మెడికల్ సీట్లు రాని వాళ్లు మాత్రమే విదేశాలకు వెళతారని కొందరు ఆరోపించారు. అయితే ఇదే సమయంలో అర్హులైన అభ్యర్థులందరికీ సరిపడా సీట్లు లేవని మరికొందరు పేర్కొన్నారు.
ఈ దేశంలో మెడికల్ కోర్సు చదవాలంటే అత్యధిక ఖర్చుతో కూడుకుని ఉన్నదనే విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని వైద్య విద్యార్థులు చదువుకునేలా సాయం చేస్తామని సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు.
ప్రస్తుతం సీఎం చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రేవంత్‌కి సలహా ఇద్దాం… వినకుంటే…