Bhagwant Mann : పంజాబ్ లో అత్యధిక స్థానాలు గెలుపొంది చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సీఎంగా భగవంత్ మాన్ (Bhagwant Mann )ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పంజాబ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెర తీశారు భగవంత్ మాన్.
ముందు నుంచీ భగవంత్ మాన్ కు భారత స్వాతంత్ర ( Indian Independence ) సంగ్రామంలో ఉరి కొయ్యలను ముద్దాడిన సర్దార్ షహీద్ భగత్ సింగ్ ( Bhagat Singh) అంటే ఇష్టం. ఆయనతో పాటు రాజ్యాంగాన్ని రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) (డా.
117 సీట్లలో 92 నియోజకవర్గాలలో చీపురు జెండా ఎగుర వేసిన వెంటనే భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి పంజాబ్ ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం ఫోటో ఉండదన్నారు.
దాని స్థానంలో మోదీ బొమ్మ కూడా ఉండడాని వీల్లేదన్నారు. సీఎం, పీఎంలకు బదులు భగత్ సింగ్, (Bhagat Singh) అంబేద్కర్ (Ambedkar) ఫోటోలు ఉండాలని ఆదేశించారు. ఊహించని రీతిలో ఓడి పోయిన 122 మంది ఎమ్మెల్యేలకు భద్రత తొలగించారు.
దేశంలో ఈ నిర్ణయం చర్చకు దారి తీసింది. బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ రావాలని కోరారు భగవంత్ మాన్. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఆరోజు నేను ఒక్కడినే ప్రమాణం చేయడం లేదు. పంజాబ్ కు చెందిన మూడు కోట్ల మంది ప్రజలు ప్రమాణం చేయబోతున్నారంటూ సంచలన ప్రకటన చేశాడు భగవంత్ మాన్.
మనందరం కలిసి కట్టుగా భగత్ సింగ్ (Bhagat Singh) కలలుగన్న రంగ్లా పంజాబ్ ను సాకారం చేద్దామని పిలుపునిచ్చాడు.
Also Read : సిబల్ కామెంట్స్ ఠాగూర్ సీరియస్