TSPSC : స‌ర్కార్ ఓకే అంటే నోటిఫికేష‌న్లు రెడీ

టీఎస్పీఎస్సీ గ‌వ‌ర్న‌ర్ కు వార్షిక నివేదిక

TSPSC  : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పూర్తిగా రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన సంస్థ‌. ఇప్ప‌టికే దేశంలో ఎక్క‌డా లేని రీతిలో 25 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగాల కోసం అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఇంకా 50 ల‌క్ష‌ల మంది జాబ్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం నియ‌మించిన బిశ్వాల్ క‌మిటీ ల‌క్షా 90 వేల‌కు పైగా కొలువులు ఖాళీగా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

ఇక సీఎం అసెంబ్లీ సాక్షిగా 80 వేల 39 పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని, రేప‌టి నుంచే నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే చాలా మంది పాలాభిషేకాలు చేశారు.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ జారీ కాలేదు. జోన్ల వారీగా, జిల్లాల వారీగా, గ్రూపుల వారీగా పోస్టులు వెల్ల‌డించారు. ఈ త‌రుణంలో ఎవ‌రూ పైర‌వీల‌ను న‌మ్మ‌వ‌ద్దంటూ టీఎస్పీఎస్సీ (TSPSC )ప్ర‌క‌టించింది.

కానీ దానికి స్వ‌యంగా భ‌ర్తీ చేసే ప‌వ‌ర్ లేదు. ఎంత సేపు ఆయా శాఖ‌లకు రాయ‌డం, వారు ఇండెంట్ పంపిస్తే భ‌ర్తీ చేయ‌డం. ఇప్ప‌టికే గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆరోపించారు.

తాజాగా ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన వెంట‌నే నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC )స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు చైర్మ‌న్ తో పాటు స‌భ్యులు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని క‌లిశారు. 2020-21 వార్షిక నివేదిక‌ను అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా సంస్థ ప‌నితీరు గురించి మేడం ఆరా తీసిన‌ట్లు స‌మాచారం.

ఉద్యోగాలు భ‌ర్త చేస్తారో చేయ‌రోన‌న్న అనుమానం ఎక్కువ‌గా నిరుద్యోగుల్లో ఉంది.

Also Read : చ‌ట్ట స‌భ‌లు చ‌ర్చ‌ల‌కు వేదిక‌లు కావాలి

Leave A Reply

Your Email Id will not be published!