Bhagat Singh Ambedkar : ఎవరైనా సీఎం అయితే తమ ఫోటోలు ఉండాలని అనుకుంటారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు.
ఇక నుంచి పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం , ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు ఉండ కూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అంతే కాదు ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజధాని చండీఘడ్ లో కాదు ఉండాల్సింది తమ తమ నియోజకవర్గాలలో ఉండాలని స్పష్టం చేశాడు.
ఈ తరుణంలో అసలు ఎందుకు భగత్ సింగ్ , అండేద్కర్ ఫోటోలు మాత్రమే ఉండాలని అన్నారనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఒకరు సర్దార్ షహీద్ భగత్ సింగ్ (Bhagat Singh Ambedkar)పంజాబ్ లోని ఖట్కర్ కలాన్ కు చెందిన వ్యక్తి. భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విప్లవ యోధుడు. పట్టుబడిన ఆయనను ఉరి తీశాడు.
తన దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన భగత్ సింగ్ తనకు ఆరాధ్య దైవమని ప్రకటించాడు సీఎం భగవంత్ మాన్. అంతే కాదు పంజాబ్ రాజకీయాలలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు మాన్.
షహీద్ పుట్టిన ఊరు లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక భారత రాజ్యాంగ చరిత్ర నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తనకు గురువు అని పేర్కొన్నాడు మాన్.
ఆయన లేక పోతే తమ లాంటి పేదలు, మధ్య తరగతి ప్రజలకు చట్ట సభల్లో ఛాన్స్ రాదని తెలిపాడు. దీంతో మాన్ తనదైన ముద్రను వేశాడు.
Also Read : వారసత్వ పాలిటిక్స్ ప్రమాదం