Wang Yi Jai Shankar : చైనా విదేశాంగ శాఖ మంత్రి రాక‌

జై శంక‌ర్ తో భేటీ కానున్న మంత్రి

Wang Yi Jai Shankar  : భార‌త్, చైనా దేశాల మధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల‌ను తొల‌గించేందుకు గాను చైనా ఓ అడుగు ముందుకేసింది. ఆ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి (Wang Yi Jai Shankar )ఏప్రిల్ 1న భార‌త్ కు రానున్నారు.

ల‌డ‌ఖ్ లోని ఎల్ఏసీ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ అనంత‌రం చైనాకు సంబంధించి ఏ సీనియ‌ర్ నాయ‌కుడు రాలేదు.

ఇదిలా ఉండ‌గా చైనా, భార‌త్ దేశాలు ప్ర‌జాస్వామ్యంగా పెద్ద దేశాల‌ని ఇరు దేశాలు ప్ర‌త్య‌ర్థులు కాకుండా భాగ‌స్వాములు కావాల‌ని వాంగ్ యి ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో ఆయ‌న టూర్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇండియాలో ప‌ర్య‌టించే కంటే ముందు వాంగ్ యినేపాల్ లో ప‌ర్య‌టిస్తారు.

ఈ సంద‌ర్భంగా ల‌డ‌ఖ్ ప‌రిస్థ‌తిని ప‌రిష్క‌రించేందుకు ఇప్ప‌టి దాకా ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపాయి ఇరు దేశాలు. కానీ ఆశించిన ఫ‌లితం రాలేదు.

చ‌ర్చ‌లలో ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతూ వ‌చ్చాయి. 2020 జూన్ 15న గాల్వాన్ వ్యాలీలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో క‌నీసం 20 మంది భార‌తీయులు, న‌లుగురు చైనా సైనికులు మ‌ర‌ణించారు.

ఈ ఘ‌ర్ష‌ణ‌లో న‌లుగురు చ‌ని పోలేద‌ని 42 మంది చైనా సైనికులు మ‌ర‌ణించారంటూ భార‌త్ ప్ర‌క‌టించింది. దీనిని చైనా ఖండించ‌లేదు. ఇదిలా ఉంగా వాంగ్ యి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ ఇద్ద‌రి దేశాల మ‌ధ్య కొంద‌రు భేదాభిప్రాయాలు జ‌రిగేలా కొన్ని దేశాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు. వీరిద్ద‌రి చ‌ర్చ‌ల్లో శాంతి నెల‌కొంటుంద‌ని ఆశిస్తున్నారు.

Also Read : ష‌హీద్..అంబేద్క‌ర్ ఫోటోలుండాలి

Leave A Reply

Your Email Id will not be published!