Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.
మోదీ ప్రతిసారీ సమావేశాలలో మాజీ దివంగత ప్రధాన మంత్రి (Prime Minister) అటల్ బిహారీ వాజ్ పేయి లాగా మాట్లాడతారని కానీ ఆయనలా ప్రవర్తించరంటూ ఎద్దేవా చేశారు.
కొన్ని సార్లు వాజ్ పేయిని అనుసరిస్తారు. మరోసారి తానే సర్వస్వం అన్నట్లు మాట్లాడతారంటూ మండిపడ్డారు శశి థరూర్(Shashi Tharoor). మోదీ మాటలకు చేతలకు చాలా తేడా ఉందన్నారు.
ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారో సభా సాక్షిగా చెబితే బాగుంటుందన్నారు. మోదీ తనను తాను యోగి అనుకుంటారు. కానీ అంత లోపే నాయకుడిగా, నియంతగా మారి పోతారంటూ సెటైర్లు విసిరారు.
ఇదిలా ఉండగా శశి థరూర్(Shashi Tharoor) తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన బుక్ ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ శక్తివంతమైన నాయకుడంటూ కొనియాడారు.
ప్రతిపక్ష పార్టీలో ఉంటూ పీఎంకు కితాబు ఇవ్వడం కలకలం రేపింది. అయితే ప్రధాని మోదీ ఏవైతే మాట్లాడతారో వాటి కోసం కట్టుబడి ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పనిలో పనిగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎప్పటికీ వాజ్ పేయి కాలేరన్న విషయాన్ని గుర్తుంచు కోవాలని సూచించారు.
ఇదే విషయాన్ని తాను చెప్పడం లేదని జర్నలిస్టు సాగరిక ఘోష్ (sagarika ghosh) రాసిన వాజేపేయి చరిత్రలో మోదీ గురించి రాశారంటూ గుర్తు చేశారు.
Also Read : పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ గుడ్ బై