Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన భగవంత్ మాన్(Bhagwant Mann )ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ. సర్దార్ షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఖట్కర్ కలాన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం సిసోడియా, అతిరథ మహారథులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా హాజరయ్యారు.
బసంతి కలర్ తో నిండి పోయింది ఈ ప్రాంతమంతా. 51 ఎకరాలలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
పంజాబ్ చరిత్రలో 1970 తర్వాత రాజ్ భవన్ లో కాకుండా ఇతర ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆప్ 92 సీట్లు గెలుపొందింది.
అశేష ప్రజల హర్షధ్వానాల మధ్య భగవంత్ మాన్(Bhagwant Mann )ప్రమాణం చేశారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్ కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ పై 58 వేల 206 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు.
అంతకు ముందు గవర్నర్ భన్వరీలాల్ భగవంత్ మాన్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన వెళ్లి పోయారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాన్ ప్రసంగించారు.
భగత్ సింగ్ కన్న కలల్ని తాను నిజం చేస్తానని ప్రకటించారు సీఎం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తాము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు భగవంత్ మాన్.
Also Read : మోదీ ఎప్పటికీ వాజ్పేయి కాలేరు