Seethakka MLA : ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. కోట్లాది ప్రజలు ఆరాధించే సమ్మక్క, సారలమ్మపై నోరు పారేసు కోవడాన్ని తప్పు పట్టారు. ఇవాళ సీతక్క(Seethakka MLA )మీడియాతో మాట్లాడారు.
చిన్నజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన పరిధి దాటి మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి ప్రతీకలు సమ్మక్క, సారలమ్మలని స్పష్టం చేశారు.
తానేదో దైవాంశ సంభూతుడిగా ఊహించుకుంటూ ఇతరులపై బురద జల్లడం మానుకోవాలని హెచ్చరించారు. మా తల్లులది వ్యాపారమా లేక సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మీరు చేస్తున్నది వ్యాపారమా అని సీతక్క (Seethakka MLA )నిలదీశారు.
చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని వెల్లడించారు.
120 కిలోల బంగారం విగ్రహం చూసేందుకు మీరు రూ. 150 టికెట్ పెట్టింది మీరు కాదా అని సీతక్క ప్రశ్నించారు. ఈ రెండింటిని పోల్చారు ఆమె. నీవు చేస్తున్నది వ్యాపారమా లేక మేము కొలిచే సమ్మక్క సారలమ్మది వ్యాపారమా చూడాలన్నారు.
లక్ష రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వాళ్ల ఇంటికి వెళ్లారా అని సంచలన ఆరోపణలు చేశారు సీతక్క. చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతే కాకుండా రియల్ ఎస్టేట్ స్వామిగా సీతక్క అభివర్ణించారు. నోరు పారేసుకుంటున్న చిన్న జీయర్ కు బుద్ది చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read : దర్శనం కోసం భక్తుల అగచాట్లు