Vikas Raj : : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా 1192 బ్యాచ్ కు చెందిన (senior ias officer) వికాస్ రాజ్(Vikas Raj) నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
(State government) తో సంప్రదించి సీనియర్ బ్యూరోక్రాట్ ను సిఇఓగా నియమించినట్లు తెలిపింది. ప్రస్తుతం వికాస్ రాజ్ (Vikas Raj) సాధారణ పరిపాలన శాఖలో ఉన్నారు.
ఆ పదవిలో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల అధికారిగా ఉంటారని స్పష్టం చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు బదిలీ అయిన శశాంక్ గోయల్ స్థానంలో సీనియర్ అధికారిగా నియమితులయ్యారు వికాస్ రాజ్ (Vikas Raj).
1992 బ్యాచ్‌కు చెందిన (senior ias officer) వికాస్ రాజ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా బాధ్యతలు స్వీకరించే ముందు వికాస్‌రాజ్ (Telangana government) పరిధిలో ఏ శాఖకైనా లేదా ఏ సంస్థ కైనా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లయితే వెంటనే వాటి నుంచి వైదొలగాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఇక నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారిగా మాత్రమే బాధ్యతలు చేపట్టాలని, ఇతర విషయాలలో కానీ లేదా అదనపు బాధ్యతలు కానీ నిర్వహించ కూడదని స్పష్టం చేసింది.
ఒక వేళ (State government) ఏదేని శాఖకు బాధ్యతలు అప్పజెప్పినా తీసుకోకూడదని హెచ్చరించింది. ఈ మేరకు (Telangana government) నికి కూడా చురకలు అంటించింది.
కాగా ఇన్ ఛార్జి సిఇఓగా అడిషనల్ సిఇఓ బుద్ద ప్రకాశ్ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయి అధికారిని నియమించింది సిఇసీ.
Also Read : వైద్య విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్